ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల
● మే నెల 15 వరకు రూపకల్పన
● డిపాల్టర్ల ఓటుహక్కుతొలగింపునకు అవకాశం
● చనిపోయిన వారి పేర్లు తొలగించాలని జౌళిశాఖకు ఆదేశం
● ఉమ్మడి జిల్లాలో 54 సహకార సంఘాలు
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 54 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పని చేస్తుండగా మరికొన్ని సంఘాలు అప్పుడప్పుడు పని చేస్తుండగా.. ఇంకొన్ని సంఘాలు మూతబడ్డాయని జౌళిశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 35 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు.
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మే నెల 15 వరకు ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే సంఘాల్లో అప్పులు లేని సభ్యులకే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుంది. దీంతో సహకార సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది.
2013లో చివరిసారి..
రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు చివరిసారి 2013, ఫిబ్రవరిలో జరిగాయి. వీటి పదవీ కాలం 2018లో ముగిసింది. తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల పాటు మొత్తం 16 పర్యాయాలు పాత పాలక వర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారిగా గత నెల మార్చి 9 నుంచి మే నెల 10వ తేదీ వరకు పదవీ కాలం పొడిగించింది. జిల్లాలోని పలు సంఘాల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
మార్చి 24న ఉత్తర్వులు జారీ..
ఓటరు జాబితా తయారీకి గత నెల 24న చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తయారు చేసిన ఓటరు జాబితాలను పక్కన బెట్టారు. చనిపోయిన, డిఫాల్టర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. సంఘానికి నగదు లేక వస్తు రూపంలో 90 రోజుల కంటే ఎక్కువ బకాయి ఉంటే డిఫాల్టర్‌గా పరిగణిస్తారు. సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండాలంటే సహకార సంఘానికి ఏమైనా బకాయిలు ఉంటే ఏప్రిల్ 13లోగా చెల్లించాలని గడువు విధించారు.
నారాయణపేట
జోగుళాంబ గద్వాల
వనపర్తి
మహబూబ్‌నగర్
నాగర్‌కర్నూల్
ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నాం
ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం చేనే త సహకార సంఘాల ఎన్ని కల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. యాక్టివ్‌గా ఉన్న చేనేత సహకార సంఘాల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించమని ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. తుది జాబితా ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ప్రకటిస్తుంది. – పద్మ, ఏడీ, చేనేత, జౌళిశాఖ


