నేడు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను సోమవారం స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్లలోపు బాల, బాలికలు, పురుషులు, మహిళలకు 100 మీ., 200 మీ., 800 మీ., 1500 మీ., 3000 మీ., 5000 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో అంశాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ మెమో, జనన, కుల ధ్రువపత్రాలతో మధ్యాహ్నం 2 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు.
19న హిందూ సమ్మేళనం
వనపర్తిటౌన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 19న జిల్లాకేంద్రంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంఘ్ జిల్లా సంపర్క్ ప్రముఖ్ అమరేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోతులమడుగు సీతారామాంజనేయ ఆశ్రమ ఉత్తర పీఠాధిపతి వెంకట్‌చరణ్‌స్వామి, ముఖ్యవక్తగా తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ కూర జయదేవ్ హాజరవుతారని చెప్పారు. హిందువులు అధికసంఖ్యలో హాజరై హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కంచె రవి, వెంకటస్వామి, విజయ్, వరుణ్, శుభాకర్, చిన్న రాయుడు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
– వివరాలు 8లో..
యుద్ధంతో మానవ మనుగడకు ముప్పు


