సిర్సనగండ్లకు పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

సిర్సనగండ్లకు పోటెత్తిన భక్తులు

Apr 6 2026 7:30 AM | Updated on Apr 6 2026 7:30 AM

చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి.. సీతారాముల దర్శనానికి క్యూ కట్టారు. ఈ సందర్భంగా శ్రీరామనామస్మరణ మార్మోగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. మొక్కులు తీర్చుకున్నారు. కొండ దిగువన వంటలు చేసుకొని ఆరంగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం హుండీలను లెక్కించనున్నట్లు ఆలయ చైర్మన్‌ రామశర్మ, ఈఓ ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement