గొప్ప సంఘ సంస్కర్త | - | Sakshi
Sakshi News home page

గొప్ప సంఘ సంస్కర్త

Apr 6 2026 7:30 AM | Updated on Apr 6 2026 7:30 AM

గద్వాల: దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ గొప్ప సంఘ సంస్కర్త అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యునతి కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తుమ్మల జయలక్ష్మి, వైస్‌చైర్మన్‌ గంజిపేట శంకర్‌, నర్సింహులు యాదవ్‌, గట్టు తిమ్మప్ప, గడ్డం కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్‌ మురళి, జంబు రామన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement