జిల్లాలో పంటల సర్వే, నమోదు వేగంగా జరుగుతోంది. క్లస్టర్ల పరిధిలో ఎంపిక చేసిన వలంటీర్లు. ఏఈఓలు ఈ సర్వేను చేపడుతున్నారు. రైతుల నుంచి పలు వివరాలు సేకరించి, యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు ఏఈఓలకు, వలంటీర్లకు తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి వివరాలు అందించి, సహకరించాలి. ఈ సర్వే ఆధారంగా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల వినియోగంపై అవగాహన వస్తుంది. దిగుబడి అంచనా వేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. – వీరప్ప, డీఏఓ
●


