పకడ్బందీగా పంటల నమోదు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పంటల నమోదు

Mar 28 2026 7:39 AM | Updated on Mar 28 2026 7:39 AM

పంటల నమోదు..

గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న వ్యవసాధికారులు

ఇప్పటికి 40 శాతం పూర్తి

పంటల దిగుబడిపై అంచనా

సర్వేతో వ్యవసాయ

పురోగతికి దోహదం

గద్వాల వ్యవసాయం: గడిచిన ఇరవై రోజుల నుంచి జిల్లాలో పంటల నమోదు (డిజిటల్‌ క్రాప్‌ సర్వే.. బుకింగ్‌) పకడ్బందీగా సాగుతోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంటలు సాగు చేశారు.. దిగుబడిపై అంచనా వస్తుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఈ వివరాలతో మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆహర ధాన్యాల లభ్యతపై ప్రభుత్వానికి స్పష్టత రానుంది.

గద్వాల వ్యవసాయ ఆధారిత జిల్లా. జూరాల, ఆర్డీ ఎ స్‌ ప్రాజెక్ట్‌లతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల.. దాని కింద ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి. దీంతో పాటు బోర్లు, బావుల కింద పంటల సాగు జరుగుతోంది. సుమారుగా ఏటా వానాకాలం సీజన్‌లో 3.80 లక్ష లు, యాసంగిలో 1.30లక్షల ఎకరాల్లో పంట లు సా గు చేస్తున్నారు. పత్తి, సీడ్‌పత్తి, వరి, కంది, మిరప, వేరుశనగ పంటలతో పాటు ఉద్యాన, వాణిజ్య పంటల సాగుపై స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు.

మండలాల వారీగా..

మండలం ఎకరాలు

అలంపూర్‌ 8,478

ధరూరు 36,850

అయిజ 47,895

ఇటిక్యాల 20,549

కేటీదొడ్డి 29,416

మానవపాడు 20,568

మల్దకల్‌ 34,269

రాజోళి 19,412

ఉండవల్లి 18,303

వడ్డేపల్లి 21,782

ఎర్రవల్లి 25,251

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement