భక్తిశ్రద్ధలతో తిక్కవీరప్పస్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో తిక్కవీరప్పస్వామి రథోత్సవం

Mar 28 2026 7:39 AM | Updated on Mar 28 2026 7:39 AM

కేటీదొడ్డి: శ్రీరామ నవమిని పురస్కరించుకొని మండలంలోని ఇర్కిచేడు తిక్కవీరప్ప ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బాసు హనుమంతు నాయుడు హజరై ప్రత్యేక పూజలు చేసి, రథం లాగారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఇర్కిచేడు మార్మోగింది. భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవంలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కుర్వ హనుమంతు, మాజీ కౌన్సిలర్‌ మురళి, సర్పంచు ఆంజనేయులు, నాయకులు కులకర్ణి శ్రీధర్‌, ఉరుకుందు, చంద్రశేఖర్‌, కృష్ణ, భగవంతు, డీలర్‌ జంగిలప్ప, గోపి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement