● రోగాల నివారణకు ప్రత్యేక చర్యలు
● చిన్న, సన్నకారు
రైతులకు
ప్రత్యామ్నాయ ఆదాయం
గట్టు: శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని గండి ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు నిర్వహించారు. పోటీల్లో బండమీది అంజి 100 కేజీ చేతి రాయిని ఎత్తి మొదటి బహుమతి రూ.4,016, ద్వితీయ బహుమతిని గువ్వల పరశురాముడు 95 కేజీల రాయి ఎత్తి రూ.3,016, తృతీయ బహుమతి తెలుగు నల్లారెడ్డి 90 కేజీల రాయి ఎత్తి రూ.2,016, నాల్గవ బహుమతి చాకలి నాగరాజు 88 కేజీల రాయి ఎత్తి రూ.1,016లను దక్కించుకున్నారు. విజేతలకు గండి ఆంజనేయస్వామి ఆలయ కమిటి సభ్యులు బహుమతులను అందజేశారు.
మూడుబండ్ల గిరక పోటీలు
మూడు బండ్ల గిరక పోటీలను సంతబజారు వేదికగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొదటి బహుమతి రూ.10,016 గట్టు తెలుగు ఆంజనేయులు ఎద్దులు 257 ఫీట్ల దూరం లాగి దక్కించుకున్నాయి. ద్వితీయ బహుమతి రూ.8,016లను సల్కాపురం మారెప్పకు చెందిన ఎద్దులు 244 ఫీట్ల దూరం గిరకను లాగి దక్కించుకున్నాయి. అంతపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఎడ్లబండి గిరక పోటీలను మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచు శంకరమ్మ, ఉపసర్పంచ్ హనుమంతు, దానయ్య తదితరులు పాల్గొన్నారు.


