నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
గద్వాల క్రైం: నామినేషన్ల ప్రక్రియ పారదర్శకమైన వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం గద్వాల మండలం పరుమాల గ్రామంలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ సందర్శించారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎవరు ఇబ్బందులు కలిగించినా వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామంలో నిఘా బృందం, క్విక్ రెస్పాన్స్ బృందం, పెట్రోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి అనుమానిత వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. ఎస్పీ వెంట రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.


