ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, ఆ దిశగా వ్యయ పరిశీలకులు తగు సూచనలు చేయాలని జిల్లా వ్యయ పరిశీలకులు రాజేష్ సూచించారు. గురువారం ఐడీఓసీ హాల్‌లో సర్పంచ్ ఎన్నికల వ్యయానికి సంబంధించి ఆయా మండలాల సహాయ వ్యయ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తాను నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ వరకు ఎన్నికల్లో ఖర్చుపెట్టిన వివరాల ను ఖాతాలో నమోదు చేయాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు, అంతకుమించి జనాభా గల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి గరిష్టంగా రూ.2.50 లక్షలలోపు, వార్డు అభ్యర్థి రూ.50వేలలోపు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. 5వేల కంటే తక్కువ జనాభా గల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలలోపు, వార్డు అభ్యర్థి రూ.30 వేలలోపు ఖర్చు చేయాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్‌కు వ్యయానికి సంబంఽధించిన వివిధ అంశాలపై శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎట్టకేలకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం
అలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లను అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా.. గన్నీ బ్యాగుల కొరత, ఇతర కారణాలతో కొనుగోళ్లు ఆలస్యంగా షురూ చేశారు. గన్నీ బ్యాగు లు రావడంతో అధికారులు మొక్కజొన్న కొనుగోలు చేశారు. ఇప్పటికే ఉండవెళ్లి, మానవపాడు ఇతర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చారు. దీంతో కేంద్రంలో నిల్వ చే సేందుకు స్థలం కరువైంది. బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్నకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు బారులు తీరారు. ఇక్కడ క్వింటాకు మద్దతు ధర రూ.2400 ఇస్తున్నారు.
మూడు రోజులు ధాన్యం తేవొద్దు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, రైతులు సైతం ధాన్యం వేసుకోవడానికి కష్టంగా ఉందని ఈ నెల 28వ తేదీ మూడు రోజుల వరకు రైతులు ఎవరూ కేంద్రానికి ధాన్యం తీసుకురావడ్దని మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెన్న, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, కార్యదర్శి ఎల్లస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం తెచ్చే తేదీలను త్వరలో ప్రకటిస్తామని, రైతులు సహకరించాలని వారు పేర్కొన్నారు.
ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి


