సర్పంచ్ 441.. వార్డులు 174
● తొలి దశ జీపీ ఎన్నికల్లో తొలిరోజు దాఖలైన నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/జెడ్పీసెంటర్/ గద్వాలటౌన్: ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో తొలి దశలో 550 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ఆయా జిల్లా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలి దశలో జరిగే ఎన్నికలకు సంబంధించి 550 సర్పంచ్ స్థానాలు ఉండగా.. తొలి రోజు 441 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా 4,840 వార్డు స్థానాలు ఉండగా... 174 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
జోగుళాంబ గద్వాలలో 68 నామినేషన్లు
● జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచు, వార్డు సభ్యులకు జరుగుతున్న మొ దటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. గురువారం ఆయా కేంద్రాల వద్ద అధికారులు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. జిల్లాలో గద్వాల, ధరూర్, కేటిదొడ్డి, గట్టు మండలాల పరిఽధిలోని గ్రామ పంచాయతీలు, వా ర్డు సభ్యులకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొత్తం 106 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకుగాను 68 నా మినేషన్లు దాఖలయ్యా యి. 974 వార్డు సభ్యులకుగాను 13 నామినేషన్లు దాఖలయ్యాయి. పలు కేంద్రాలలోని నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
సర్పంచ్ 441.. వార్డులు 174


