ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మల్దకల్: ఉపాధిహామీ సామాజిక తనిఖీల్లో వచ్చే ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విజిలెన్స్ అధికారి ఉమారాణి అన్నారు. శనివారం మల్దకల్ ఎంపీడీఓ కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులపై జరుగుతున్న సామాజిక తనిఖీలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహించవద్దని, తనిఖీలు నిర్వహిస్తున్న గ్రామాల నుంచి ఫిర్యాదులు అందడం అధికారుల నిర్లక్ష్యమేనని, సామాజిక తనిఖీలకు అధికారులు మండలాలకు రాకముందే రికార్డులను సరిచేసుకోవాలన్నారు. అదే విధంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులకు రికార్డులు తప్పనిసరిగా అందజేయాలని పేర్కొన్నారు. వీసీలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంపీఓ రాజశేఖర్, ఏపీఓ సుజాత, టెక్నీకల్ అసిస్టెంట్లు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


