త్వరగా పూర్తి చేయాలి
గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి. సాగు నీటి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. బోర్ల ద్వారానే పంటలు పండిచుకుంటున్నాం. వర్షాలు వస్తేనే బోర్లలో నీరు పుష్కలంగా ఉంటాయి. వర్షాలు లేక పోతే బోర్లు ఎండిపోతాయి. ప్రభుత్వం గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
– జగదీష్, రైతు, రాయాపురం
అంచనాలు రూపొందిస్తున్నాం
గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయి. రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఏ మేరకు పెంచాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకే అంచనాలను రూపొందిస్తున్నాం. ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గట్టు ఎత్తిపోతల పథకం అంచనా తయారీలో నిమగ్నమయ్యాం.
– రహీముద్దీన్, ఎస్‌ఈ, గద్వాల
●


