అక్రమార్కులకు సహకారం..
ఆది నుంచి జిల్లా సివిల్‌సప్లైశాఖ అధికారులకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వరంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన పలువురు అధికారులు రూ.కోట్ల విలువైన ధాన్యం స్వాహాలో ప్రత్యక్ష ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొందరిపై ఏకంగా విజిలెన్స్ అధికారులు చేపట్టిన విచారణలో అవినీతి రుజువు కావడంతో కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా సివిల్‌సప్లైశాఖలో కీలకంగా పనిచేసే ఓ జిల్లాస్థాయి అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారి రెండేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా కార్యాలయంలోని తన కుర్చీవైపు తొంగి చూడలేదనే అపవాదు ఉంది. దీనిపై గతంలో ఆధారాలతో సహా ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ సదరు అధికారి తీరులో మార్పులేదు.
చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యానికి సంబంధించి మిల్లర్లు సీఎమ్మార్ బియ్యం పెట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ఆర్‌ఆర్ యాక్టు ద్వారా సొమ్మును రికవరీ చేస్తాం. టెండర్ ధాన్యం నిల్వలపై నివేదిక తెప్పించుకుని అవసరమైన చర్యలు తీసుకుంటాం.
– వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్
●


