రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
గద్వాల/ఇటిక్యాల: జిల్లాలో వరిధాన్యం కొనుగో లు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీఓసీ కా ర్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వానాకాలం వరిధాన్యం సేకరణ కోసం 84 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో చేస్తున్నట్లు గన్నీబ్యాగు లు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీన ర్లు, తేమ నిర్ధారణ యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అదే విఽ దంగా పత్తి కొనుగోళ్లకు సంబంధించి కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్‌పై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిజిటల్ క్రాప్ సర్వే సమయంలో రైతులు ఇచ్చిన ఫోన్ నంబర్లు మారితే కొత్త నంబర్లను అప్‌డేట్ చేసుకునేలా చూడాలన్నారు. జిల్లావ్యాప్తంగా 2.24లక్షల మెట్రిక్ టన్నుల పత్తి రానుందని.. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీఎస్‌ఓ స్వామికుమార్, డీఎం విమల, డీఏఓ జగ్గునాయక్, మార్కెటింగ్ అధికారిణి పుష్పమ్మ, కోఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్, డీఎస్పీ మొగిలయ్య, ఏడీఏ సంగీతలక్ష్మి ఉన్నారు.
● ధ్యానం నిల్వ వ్యవస్ధ పక్కాగా నిర్వహించి.. ఎల్లప్పుడూ నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇటిక్యాలలోని స్టేట్ వేరోస్ కార్పొరేషన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ బఫర్ గోదాంను ఆయన పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. గోదాంలో నాణ్యతమైన ధాన్యాన్ని మాత్రమే నిల్వ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు తేమ శాతాన్ని పరిశీలించాలని సూచించారు. ఓపీఎంఎస్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలో దాదాపు 40వేల టన్నుల ధాన్యం గోదాముల్లో నిల్వ ఉన్నందున.. ఇతర జిల్లాలకు తరలించనున్నట్లు తెలిపారు.
పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి..
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఇటిక్యాల పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నెలనెలా అన్ని పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులు అందించాలన్నారు. పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్ విమల, టెక్నికల్ అధికారి సుబ్బన్న, గోదాం మేనేజర్ నాగరాజు, తహసీల్దార్ వీరభద్రప్ప, డా.అనిరుధ్, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ ఉన్నారు.


