
బాధ్యతగా విధులు నిర్వహించాలి
అయిజ: పోలీసులు బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎస్పీ టి. శ్రీనివాసరావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఎస్పీ అయిజ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. సిబ్బంది యూనిఫామ్ టర్న్ ఔట్, స్టేషన్ రికార్డ్స్, పరిసరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కిట్ ఆర్టికల్స్ సద్వినియోగం చేసుకోవాలని, సరిహద్దుల్లో ఎలాంటి అక్రమ రవాణాకు అవకాశం ఉండకూడదని అన్నారు. గ్రామాల్లో వీపీఓలు గ్రామాల్లో ఎలాంటి సమాచారమైన తెలుసుకొని ఉండాలని, ఫిర్యాదులపై పాటిటివ్ స్పందనే పోలీసుల పనితీరును తెలియజేస్తుందని అన్నారు. ఈసందర్భంగా ఎస్పీ చేతుల మీదుగా ప్రజలు పోగొట్టుకున్న 10 సెల్‌ఫోన్లను బాధితులకు అందజేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. శంకర్, డీఎస్పీ మెగలయ్య, శాంతినగర్ సీఐ టాటా బాబు, ఎస్సైలు శ్రీనివాసరావు, తరుణ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ
అందరి బాధ్యత
గద్వాలటౌన్: పర్యావరణ వ్యవస్థలో సమస్త జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయని, అటువంటి పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షేక్ కలందర్ బాషా అన్నారు. పర్యావరణ, అడవులు, వాతావరణ కేంద్ర మంత్రిత్వశాఖ, తెలంగాణ ఎన్‌జీసీ ఆదేశాల మేరకు బుధవారం కళాశాలలో ‘ఎకో బజార్’ను ఏర్పాటు చేశారు. కళాశాలలోని ఇకో క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇకో బజార్‌ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు పర్యావరణహిత వస్తువుల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు చేతితో తయారు చేసిన జూట్ బ్యాగులు, పేపర్స్‌తో తయారు చేసిన వస్తువులు, విల్లెట్స్‌తో చేసిన తిను బండారాలు, వెదురు చేసిన వస్తువులను ప్రదర్శించడం జరిగింది. ప్రిన్సిపల్‌తో పాటు అధ్యాపకులు స్టాల్స్‌ను తిలకించి, వాటిని ఏవిధంగా తయారు చేశారనే వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. ప్లాస్టిక్ భూతం నుంచి మన ధరిత్రిని రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎకో క్లబ్ కమిటీ కన్వీనర్ కరుణాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్ చంద్రమోహన్, సభ్యులు పద్మా, గణేష్, కృష్ణయ్య, హరినాథ్, తదితరులు పాల్గొన్నారు.
చెరుకు సాగుతో
అధిక లాభాలు
ఎర్రవల్లి: రైతులు చెరుకు సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని కృష్ణవేణి చెరుకు పరిశ్రమ సలహాదారుడు రాంమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సాసనూలులో యూపీఎల్ ఆధ్వర్యంలో రైతులకు చెరుకు పంట సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చెరుకు సాగు ప్రాధాన్యత, సాగులో తీసుకోవాల్సిన మెళకువలు, సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు చెరుకు సాగు కోసం ముందస్తుగా నీటి లభ్యతతో పాటు సరైన స్వభావం గల నేలలను, తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే కొత్త రకాలను ఎంచుకోవాలన్నారు. సాగులో బిందుసేద్యం వినియోగించడం వల్ల నీటి వినియోగం తగ్గడంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందన్నారు. ముఖ్యంగా అంతర కృషి ద్వారా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలన్నారు. నేలను సారవంతం చేసి భూమిలో కర్బన శాతాన్ని పెంచడం కోసం రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని పిఎస్‌బి, కెఎస్‌బి వంటి బ్యాక్టీరియాలను వినియోగించుకోవాలన్నారు. అవసరాన్ని బట్టి 7–10 రోజుల వ్యవధిలో తప్పకుండా నీటి తడులను పెట్టుకోవాలన్నారు. చెరుకు చెత్తను మల్చ్‌గా వినియోగించడం వల్ల నేలలో తేమ నిలిచి ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చునన్నారు.

బాధ్యతగా విధులు నిర్వహించాలి

బాధ్యతగా విధులు నిర్వహించాలి