
బకాయిలు విడుదల చేయాలి
అలంపూర్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు రూ.180 కోట్ల బకాయి పెండింగ్‌లో ఉందని, దీంతో ఈ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న దాదాపు 30 వేల మంది దళిత గిరిజన విద్యార్థులు రోడ్డున పడ్డారని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి, ప్రధాన కార్యదర్శి రాజులు ఎమ్మెల్యే విజయుడును కోరారు. కర్నూల్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయుడును బుధవారం కలిసి పెండింగ్ నిధులు తక్షణమే చెల్లించాలని, విద్యార్థులు రోడ్డున పడుతున్నారనివినతి పత్రం అందజేశారు. ప్రభుత్వంతో, ఇంచార్జీ మంత్రితో మాట్లాడి బకాయి నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని విజయ్, వెంకటస్వామి, ప్రభాకర్ కోరారు.