జోగుళాంబ గద్వాల | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ గద్వాల

Oct 14 2025 7:33 AM | Updated on Oct 14 2025 7:33 AM

జోగుళాంబ గద్వాల

జోగుళాంబ గద్వాల

న్యూస్‌రీల్‌

‘మాటల’ మంటలు..

..రైతులకు వరం

ప్రధానమంత్రి ధన్‌ ధాన్య కృషి యోజన పథకం రైతులకు వరం అని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు.

మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

–10లో u

అన్నీ మహబూబ్‌నగర్‌ వాళ్లకేనంటూ..

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాల కీలక నేతల మధ్య తొలి నుంచీ అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా గ్రంథాలయ చైర్మన్‌, ముడా చైర్మన్‌ పదవులు మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి దక్కాయి. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ పదవి సైతం ఈ సెగ్మెంట్‌కు చెందిన ఒబేదుల్లా కొత్వాల్‌కు కేటాయించారు. ఈ క్రమంలో అన్ని పదవులు మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ నేతలే తన్నుకుపోతున్నారనే అభిప్రాయం జడ్చర్ల నాయకుల్లో ఉంది. దేవరకద్రకు చెందిన సీతాదయాకర్‌రెడ్డి తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియామకమైనప్పటికీ.. మహబూబ్‌నగర్‌కే పెద్దపీట వేస్తున్నారనే అభ్రిపాయం ఈ సెగ్మెంట్‌ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.

మా సెగ్మెంట్‌లోనూ పెత్తనం చెలాయిస్తున్నారని..

డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి జిల్లాకేంద్రంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఇక్కడి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గంలోనూ ఆయన పెత్తనం సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అనుచరుల్లో నెలకొంది. దీనిపై యెన్నం ఎక్కడా స్పందించకున్నా.. డీసీసీ అధ్యక్షుడు జీఎమ్మార్‌ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరుకాకపోవడం, అంటీముట్టనట్లుగా వ్యవహరించడంపై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది.

అధికార వార్‌..!

‘‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్‌, సర్పంచ్‌ పోస్టుల్లో నిలబడాలని అనుకుంటున్న

కాంగ్రెస్‌ నాయకులు.. వివిధ హోదాల్లో ఉన్న కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. తాము ఇంట్లో కూర్చుని ఉన్నా.. బీఫాంలు వస్తాయని పగటి కలలు కంటున్నారు.

మేం చెబితే బీఫాంలు వస్తాయని ఎవరైతే చెబుతున్నారో.. వారి ఆటలు కొనసాగనివ్వం. డీసీసీ అధ్యక్షుడిగా నేనే బీఫాంలు ఇచ్చేదని గ్రహించాలి.’’

– జి.మధుసూదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు,

దేవరకద్ర ఎమ్మెల్యే (ఓట్‌ చోరీ కార్యక్రమంలో)

‘‘ఇప్పటివరకు ఫ్యాక్షన్‌ రాజకీయాలు లేవు. సర్పంచ్‌ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్నూ చంపొచ్చు. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నాలు చేసిన వారిని పార్టీలోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలెవరూ ఒప్పుకోరు.

– అనిరుధ్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే

(విలేకరుల సమావేశంలో)

..మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికార పార్టీ

కాంగ్రెస్‌లో మాటలు మంటలు రేపుతున్నాయనే దానికి ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. బీసీల్లో బలమైన సామాజిక వర్గ నాయకుడు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఇటీవల తెరపైకి

రావడం.. డీసీసీ అధ్యక్ష పదవికి ఏఐసీసీ పరిశీలకులు కసరత్తు చేపట్టిన క్రమంలో ఆయా

నియోజకవర్గాల్లో లుకలుకలు వెలుగుచూస్తున్నాయి. కీలకనేతల మధ్య అంతర్గత విభేదాలతో పోరు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో

సైతం ‘హస్తం’ నేతల మధ్య అంతర్యుద్ధం

కొనసాగుతుండగా.. పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

కాంగ్రెస్‌లో అంతర్గత పోరు

డీసీసీ అధ్యక్ష పదవికి చేపట్టిన కసరత్తులో అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మధుసూదన్‌రెడ్డి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బీసీల నుంచి సంజీవ్‌ ముదిరాజ్‌, ఎన్‌పీ వెంకటేష్‌.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వినోద్‌కుమార్‌, మైనార్టీల నుంచి సిరాజ్‌ఖాద్రీ, జహీర్‌ అక్తర్‌ పోటీపడుతున్నారు. అయితే డీసీసీ పదవిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఏదైనా సామాజిక వర్గానికి చెందిన సమర్థవంతమైన నాయకుడితో భర్తీ చేస్తే బాగుంటుందని అనిరుధ్‌రెడ్డి కోరడం చర్చనీయాంశమైంది. ఒకవేళ రెడ్డి వర్గానికి కేటాయించిన పక్షంలో తన సోదరుడు దుష్యంత్‌రెడ్డి కూడా పోటీలో ఉంటారని ఆయన చెప్పకనే చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీసీసీ పదవికి దుష్యంత్‌రెడ్డి దరఖాస్తు చేసుకోలేదని ఆయన చెబుతున్నా.. కాంగ్రెస్‌ శ్రేణుల్లో మాత్రం భిన్నవాదనలు విన్పిస్తున్నాయి. దీంతో పాటు బీసీల్లో బలమైన సామాజిక వర్గ నాయకుడు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెరపైకి వచ్చిన క్రమంలో అనిరుధ్‌రెడ్డి సోమవారం జడ్చర్లలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అలాగే ఇటీవల డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్యాలయంలో నిర్వహించిన ఓట్‌ చోరీ సంతకాల సేకరణలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకాని వారికి ఇదో హెచ్చరిక అంటూ బీఫాంలపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

గద్వాల, వనపర్తిలోనూ లుకలుకలు

వనపర్తి జిల్లాలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్‌ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అనుచరుడు లక్కాకుల సతీష్‌, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గానికి చెందిన కిరణ్‌కుమార్‌ పోటీలో ఉన్నారు. వీరితో పాటు శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి సైతం డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయా నేతల వర్గాల మధ్య వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు సరిత మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. ఆయా వర్గాలకు చెందిన నేతలు డీసీసీ పదవికి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏఐసీసీ నాయకుడు సంపత్‌కుమార్‌ మద్దతు కీలకం కాగా.. చివరి వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు తమ మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని.. పార్టీ విధానాల ప్రకారం సమష్టి నిర్ణయాలతోనే ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు. కానీ వారివారి ముఖ్య అనుచరులతో పాటు పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటు ‘ఢీ’ సీసీ.. అటు ‘చేరిక’పంచాయితీ

మాటల తూటాలను పేలుస్తున్న నేతలు

మహబూబ్‌నగర్‌లో తారాస్థాయికి విభేదాలు ?

గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ కుతకుత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement