
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
మల్దకల్: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్య నేరమని డీఈఓ విజయలక్ష్మీ, డీడబ్ల్యూఓ సునంద అన్నారు. సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్దకల్ కస్తూర్బా పాఠశాలలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన తర్వాతే బాలికలకు వివాహాలు చేయాలని, బాల్యవివాహాలు చేయడం వలన కలిగే అనర్థాలను వివరించారు. అలాగే బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస వంటి అంశాలను వివరించారు. బాలికలు చదువుకున్నప్పుడే పురుషులతో సమానంగా రాణించగలుగుతారని సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీడీపీఓ హేమలత, డీసీపీఓ నరసింహ, జీసీడీఓ హంపయ్య, ఎంఈఓ సురేష్, ఎస్‌ఓ విజయలక్ష్మీ, ఏఎస్‌ఐ ఈశ్వరయ్య ,సురేష్, ప్రకాష్, శివ, పద్మమ్మ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.4,859
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 280 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.4859, కనిష్టం రూ.2905, సరాసరి రూ. 4091 ధరలు లభించాయి. అలాగే, 156 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5901 కనిష్టం రూ. 5429, సరాసరి రూ. 5901 ధరలు పలికాయి.