
సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి
ప్రజావాణికి 72 ఫిర్యాదులు
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుకు ప్రాధాన్యతినిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఐడీవోసీ కార్యాలయంలో ప్రజలు 72 ఫిర్యాదులు ఇచ్చారని వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులు పంపి పరిష్కరించాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. పరిష్కారం కాని యెడల అందుకు సంబంధించి కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్‌నాలెడ్జ్‌మెంట్ పంపాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
గద్వాల: ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ అందిస్తే వారి ప్రాణాలు రక్షించవచ్చని, సీపీఆర్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఒత్తిడితో కూడిన ప్రజాజీవితంలో ఆకస్మాత్తుగా గుండెపోటు సంభవించడం పరిపాటిగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు గుండెపోటుకు గురైన వ్యక్తికి పూర్తిస్థాయి వైద్యసాయం అందేలోపు చాతిని 30సార్లు నొక్కి రెండు శ్వాసలు ఇవ్వడం ద్వారా గుండె తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. కార్డియక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జిల్లాలోనూ ఈనెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వారంరోజుల పాటు సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈవిధానంపై గ్రామాల నుంచి పట్టణాల వరకు అందరిలోనూ అవగాహన కల్పించేలా అధికారులు కృషి చేయాని వైద్యధికారులను ఆదేశించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ డాక్టర్ రాజు, డాక్టర్ మధు ప్రయోగకపూర్వంగా సీపీఆర్‌ను ఎలా చేయాలో క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, వైద్యధికారి డాక్టర్ సిద్దప్ప, డాక్టర్లు సంధ్య, కిరణ్మయి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.