
యూరియా కోసం తప్పని తిప్పలు
ఎర్రవల్లిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
ఎర్రవల్లి: వానాకాలంలో వరి, చెరుకు, వేరుశనగ, పత్తి తదితర పంటలు సాగుచేసిన రైతులకు యూరియా లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్‌లు, ఇతర ఎరువుల విక్రయ కేంద్రాలకు చేరుకొని గంటల తరబడి నిరీక్షించినా రెండు బస్తాల యూరియా లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం వివిధ గ్రామాల రైతులు ఎర్రవల్లి సింగిల్‌విండో కార్యాలయానికి తెల్లవారుజామునే చేరుకొని యూరియా కోసం క్యూ కట్టారు. కొందరు తమ పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులను క్యూలైన్‌లో పెట్టి నిరీక్షించారు. యూరియా కొరత కారణంగా పస్తులుండి పడిగాపులు కాయాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం సరిపడా యూరియాను అందించాలని కోరారు.