
గిరిజన హక్కుల సాధనకు అలుపెరగని పోరాటం
గద్వాలన్యూటౌన్: లంబాడీ, గిరిజన హక్కుల సాధన కోసం సేవాలాల్ సేన అలుపెరగని పోరాటాలు చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర ఇన్‌చార్జి మూడావత్ కృష్ణనాయక్, అధ్యక్షుడు ఆంగోత్ రాంబాబు అన్నారు. మంగళవారం సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రాజీవ్ సర్కిల్ సమీపంలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంత్‌శ్రీ తపస్వి రామారావు మహరాజ్ చేతుల మీదుగా సేవాలాల్ సేన ఆవిర్భవించిందని చెప్పారు. రాష్ట్రంలో లంబాడీ, గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. లంబాడీ, గిరిజనుల్లో రాజకీయ చైతన్యం రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మూడావత్ రవి నాయక్, ఉపాధ్యక్షుడు నెనావత్ రవినాయక్, నర్సింహులు, రేఖానాయక్, పాత్లావత్ రవి నాయక్, ధాన్య నాయక్, నరేంద్రనాయక్, నర్సింహ పాల్గొన్నారు.