
అప్రజాస్వామ్యం..
పత్రికల గొంతు నొక్కడం
● సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు
● మీడియాపై అణచివేత విధానాలను ఖండించిన పాత్రికేయ సంఘాలు, రాజకీయ నాయకులు
●
‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికలపై, సంపాదకులపై పనిగట్టుకొని కేసులు నమోదు చేయడం దారుణం. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేయడం సరికాదు. పత్రికలు తమ పని తాము స్వేచ్ఛగా చేసినప్పుడే సమాజంలోని అన్నివర్గాల అభిప్రాయాలు ప్రజలకు చేరువవుతాయి.
– వి.నరేందర్‌చారి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం ఎవరికీ సమర్థనీయం కాదు. ప్రతిపక్షాలు మాట్లాడలేనప్పుడు కూడా ప్రజల సమస్యలు, ఇబ్బందులను పాలకుల దృష్టికి తీసుకొస్తాయి. అలాంటి పత్రికలు, మీడియాపై అణచివేతకు పాల్పడేలా దాడులకు దిగడం.. కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇప్పుడు ఒకరు అనైతిక చర్యలకు దిగారంటే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ పోతే అభివృద్ధి కుంటుపడడమే కాకుండా రాష్ట్రం రావణకాష్టగా మారుతుంది. రాజకీయాల మాటున కక్షసాధింపు చర్యలు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికై నా పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి.
– శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్‌నగర్

అప్రజాస్వామ్యం..

అప్రజాస్వామ్యం..