
రాజీ కేసులపై ప్రత్యేక డ్రైవ్
గద్వాల క్రైం: పెండింగ్ కేసుల విషయంలో పురోగతి సాధించేందుకు సమయస్ఫూర్తితో అడుగులు వేశామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సెషన్స్ కోర్టు జడ్జి ఎన్ ప్రేమలత వెల్లడించారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్ కేసులు, రాజీకాదగా కేసులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. ఈ నెల 13వ తేదిన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, గతంతో పొలిస్తే నేటికి చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ, రోడ్డు ప్రమాద, బ్యాంకు రుణాలు, స్టేషన్‌లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఆ శాఖ సిబ్బందితో మాట్లాడి విపత్కర కేసుల అంశాలను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ వి శ్రీనివాస్, శోభ తదితరులు ఉన్నారు.