
కఠిన చర్యలు తీసుకుంటాం
జిల్లాలో ఇటీవల జరిగిన దాడుల్లో చదువు మానేసిన వారు, మెకానిక్‌లు, మేసీ్త్ర, లేబర్ పనులు చేసే యువతే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. పలువురిపై కేసులు నమోదుచేశాం. బెల్టు దుకాణాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిషేధిత మత్తు పదార్థాలు, మద్యంకు బానిసైన వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. తల్లిదండ్రులు ఉండి పట్టించుకోని వారితోపాటు మిగతా వారిలో మార్పు దిశగా కౌన్సెలింగ్ అందిస్తాం. మార్పు రాకపోయినా, మరోసారి ఇలాగే పట్టుబడినా కఠిన చర్యలు తీసుకుంటాం.
– మొగిలయ్య, డీఎస్పీ
●