
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
● సభా స్థలాన్ని పరిశీలించిన మాజీమంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్
గద్వాల: ఈనెల 13వ తేదీన గద్వాలకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు రానున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే విజయుడు, ఆ పార్టీ నాయకులు ఆంజనేయగౌడ్, బీఎస్ కేశవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గద్వాలలో వారు పర్యటించారు. మొదటగా స్థానిక పాతబస్టాండ్‌లో బహిరంగసభ స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా రోడ్‌షోను నిర్వహించే ప్రాంతాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను, కార్మికులను, ఉద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, దీనిపై ప్రజా ఉద్యమంతో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. పదేళ్ల కాలంలో యూరియా సమస్య తలెత్తకుండా కేసీఆర్ పాలించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బాసు హనుమంతు, మోనేష్, రాజు, వెంకటేష్‌నాయుడు, కోటేష్, యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు.