
అలంపూర్ ఆలయాలు మూసివేత
● చంద్రగ్రహణం నేపథ్యంలో గర్భాలయాలకు తాళం వేసినఅర్చకులు
● ఉదయం కొనసాగిన పూజలు, దర్శనాలు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను అర్చకులు మూసివేశారు. ఆదివారం రాత్రి చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయాల్లో తాత్కాలికంగా పూజలు, భక్తుల దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ ఈఓ దీప్తి, కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూజలు, భక్తు ల దర్శనాలు, హోమ పూజలు యథావిధిగా కొనసాగాయి. మధ్యాహ్నం నుంచి ఆలయాలను మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయా ల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇరు గర్భాలయాలకు తాళాలు వేశారు. చంద్రగ్రహణం రాత్రి ఉండటంతో తిరిగి ఈ నెల 8వ తేదీ సోమవారం ఉదయం ఆలయాలు తెలిచి శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అనంతరం 8.30 గంటలకు మహా మంగళహారతితో దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని ఈఓ, చైర్మన్ పేర్కొన్నారు.
ఆదిశిలా క్షేత్రం..
మల్దకల్: చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం ఉదయం 11.30గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు మూసివేయనున్నట్లు ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి తెలిపారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ది, సంప్రోక్షణ చేసిన తర్వాత భక్తులకు స్వామి వారి దర్శనం ఉంటుందని తెలిపారు.

అలంపూర్ ఆలయాలు మూసివేత