
పర్సంటేజీలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏది..?
ప్రజలకు అందుబాటులో
కోర్టు నిర్మాణాలు..
అనంతపురం గుట్టలలో కోర్టు భవన సమూదాయాలను నిర్మించాలని పాలకులు ప్రయత్నించడం వారి అసమర్థపాలనకు నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ భూమి సిద్దాంతచారి కుంటను కబ్జా చేసుకోవడానికి పాలకులు ప్రయత్నిస్తున్నాని, ఆ భూమిని కోర్టు సముదాయానికి అప్పగిస్తే అందరికి ఆమోద యోగ్యంగా ఉంటుందన్నారు. పాలకుల బీనామీలకు, రియల్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికి కాకుండా ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థలం కేటాయించాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నీతి మాలిన రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. అనంతరం కలెక్టర్ సంతోష్‌తో సమావేశమై గద్వాల అభివృద్ధి, నూతన కోర్టు భవనాల స్థలం కేటాయింపుపై చర్చించి, వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తూళ్ల వీరేంద్రగౌడ్, రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రమాదేవి, కృష్ణవేణి, బండల పద్మావతి, రాజగోపాల్, శివారెడ్డి, సమత, శోభరాణి, వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణంరాజు, రఘుగౌడ్, బండల పాండు పాల్గొన్నారు.
గద్వాలటౌన్: పార్టీలు మారడం, పర్సంటేజీలు తీసుకోవడం తప్ప, అభివృద్ధిపై పాలకులకు ధ్యాస లేదని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. గద్వాల అభివృద్ధిలో పాలకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ.. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ముందుగా ఆ పార్టీ నాయకులు మోటార్ బైక్ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. ఇక్కడున్న ప్రజాప్రతినిధికి పార్టీ కండువాలు మార్చడం మీదున్న శ్రద్ధ అభివృద్దిపై కొరవడిందని మండిపడ్డారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరకీ అర్థం కావడం లేదని, అలాంటి వ్యక్తి గద్వాలలో ఉండటం దురదృష్టకరమన్నారు. విద్వత్ గద్వాలను వివాదాల గద్వాలగా మార్చిన చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పుకునే వ్యక్తి.. ఏడాదిన్నరలో ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. తుమ్మిళ్ల, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల, ఆర్డీఎస్ పథకాలు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ర్యాలంపాడు, జూరాల ప్రాజెక్టు లీకేజీల సమస్యను ఎందుకు సరిచేయలేదని నిలదీశారు. గద్వాలలో నీను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే తప్ప మరోకటి కనిపించడం లేదని విమర్శించారు. ఏ పనిలో ఎంత దోచుకుందాం అనే యావలోనే ఇక్కడి నేతలు ఉన్నారని ఆరోపించారు.
అఽధికార పార్టీ నేతలపై
మండిపడ్డ ఎంపీ డీకే అరుణ