
ఐదు ఎకరాల్లో మాత్రమే వేశా..
గడిచిన రెండేళ్లు పది ఎకరాల్లో ఎండుమిర్చి సాగు చేశాను. విపరీతంగా తెగుళ్లు వచ్చా యి. పురుగు మందులకు రూ.వేలకు వేలు ఖర్చు పెట్టినా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. దీనికితోడు ధరలు కూడా పలకలేదు. ఆర్థికంగా చాలా నష్టం జరిగింది. దీంతో ఈసారి ఐదు ఎకరాల్లో మాత్రమే ఎండుమిర్చి వేశాను.
– వెంకటేశ్వర్లు, రైతు, చెన్నిపాడు, మానవపాడు మండలం
పత్తి సాగు చేశారు..
జిల్లాలో ఈ ఏడాది ఎండుమిర్చి దాదాపు 33 వేల ఎకరాలకు పైగా సాగు అవుతుందని అంచనా వేశాం. అయితే చాలా చోట్ల ఎండుమిర్చికి బదులుగా రైతులు పత్తి సాగు చేశారు. దీంతో ఈ ఏడాది ఎండుమిర్చి సాగు తగ్గింది. తెగుళ్ల బెడద, పంట దిగుబడి తగ్గడం, ధర లేకపోవడం వంటివి ఇందుకు కారణమయ్యాయి. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానవన శాఖాధికారి
●

ఐదు ఎకరాల్లో మాత్రమే వేశా..