
కలెక్టర్ ఆదేశాల మేరకు..
అనుమతి లేకుండా జిల్లాలో పలు ప్రథమ చికిత్స, ఆస్పత్రులు ఉన్నట్లు గుర్తించి తనిఖీలు చేపడుతున్నాం. వారి నుంచి ప్రమాదకరమైన మందులను సీజ్ చేశాం. ప్రజల ఆరోగ్యంపై కొందరు ఆర్‌ఎంపీలు చేస్తున్న సేవలు దారుణంగా ఉన్నాయి. ఇలాంటి చర్యలపై శాఖాపరమైన చర్యలు, కలెక్టర్ ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని ఎంతమాత్రం వదిలిపెట్టం.
– సిద్ధప్ప, జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి
కేసులు నమోదు చేస్తాం..
రోగులను మోసం చేస్తున్న ఆర్‌ఎంపీలపై నిఘా ఉంచాం. వారు చేయాల్సిన సేవలు మాత్రమే చేయాలి. మత్తు కలిగించే మందులు, స్టెరాయిడ్స్, నొప్పులు నివారించే మందులు తదితర వాటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు.. వారికి ఏ నిబంధనలతో మందులు ఇస్తున్నారనే అంశాలపై ప్రత్యేక విచారణ చేపడుతాం. చట్ట వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ
●

కలెక్టర్ ఆదేశాల మేరకు..