
అందరి సహకారంతో గట్టుకు గుర్తింపు
గట్టు: దేశంలోనే వెనుక బడిన ప్రాంతాల అభివృద్ది సూచిక నీతి అయోగ్ ఆస్పరేషన్ బ్లాక్‌లో గట్టుకు దేశ వ్యాప్తంగా 5వ స్థానం గుర్తింపు రావడానికి అందరి సహకారం ఎంతో ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం గట్టులో నిర్వహించిన నీతిఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల అభివృద్ధికి కృషి చేసిన జిల్లా, మండల స్థాయి అధికారులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి అభినందిస్తూ, మెమోంటోలు, సర్టిఫికెట్లను అందించి సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో 5వ స్థానానికి గట్టు మండలాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. గట్టు మండల అభివృద్ధికి రాజకీయ పరంగా, పరిపాలనా పరంగా, అన్ని విధాల సహాయ సహకారాలు అందించడంలో వివిధ శాఖల అధికారుల విశేష కృషి ఉందన్నారు. దేశంలో 5వ స్థానం, రాష్ట్రంలో 2వ స్థానం సాధించినందుకు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో క్షేత్ర స్థాయిలో మంచి సేవలను అందించిన అధికారులను గుర్తించి సన్మానించుకోవాలనే ఉద్దేశంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీతి అయోగ్ ద్వారా మంజూరైన రూ.కోటిలో 70లక్షలతో ఆధునిక సాంకేతికత గల భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు.
భవిష్యత్‌లో గట్టు రూపురేఖలు మార్పు: ఎమ్మెల్యే
రాబోయో రోజుల్లో గట్టు మండల రూపురేఖలు మారుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సంపూర్ణ అభియాన్‌లో దేశంలోనే గట్టుకు 5వ స్థానం గుర్తింపు రావడం సంతోషంగా ఉందని, ఈ విజయం అందరిది అన్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులను సన్మానించి, మెమొంటోలను అందించారు. అదనపు కలెక్టర్ నర్సింగరావు, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, తహసీల్దార్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఫోటో(28జీడీఎల్–401) గట్టు ఎంపీడీఓ చెన్నయ్యకు మెమోంటో అందజేస్తున్న కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి