
పర్యావరణ హితానికి..
చిట్టి చేతులు పర్యావరణ హితానికి కదిలాయి. మట్టి గణపతులను తీర్చిదిద్దాయి. ఎన్‌జీసీ (నేషనల్ గ్రీన్ కోర్), కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులతో మట్టి గణపతుల తయారీ శిబిరాన్ని నిర్వహించారు. చెరువు పూడిక మట్టితో ప్రతిమలు తయారు చేశారు. గద్వాలకు చెందిన విద్యార్థిని శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే అంకుర సంస్థను ప్రారంభించి పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ.. వేరుశనగ పొట్టుతో తయారు చేసిన గణేష్ ప్రతిమలను ఉచితంగా అందజేశారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్ సహకారంతో పర్యావరణహిత వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించాలన్నారు. పూజలో వినియోగించే 21 రకాల పత్రి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. మట్టి ప్రతిమతో పాటు పత్రిని జల వనరులలో నిమజ్జనం చేయాలన్నారు.