
యూరియా కోసం తప్పని తిప్పలు
గద్వాల వ్యవసాయం: యూరియా కోసం అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. నిత్యం సింగిల్ విండో కార్యాలయం వద్ద బారులుదీరి నిలబడటంతోపాటు టోకెన్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మంగళవారం గద్వాల సింగిల్ విండో కార్యాలయానికి రైతులు ఉదయం 7 గంటలకే చేరుకోగా.. టోకెన్ల పంపిణీ 8 గంటలకు ప్రారంభమైంది. ఈ క్రమంలో సుమారు 300 మంది రైతులు రాగా, ఇందులో 50 మందికి పైగా మహిళా రైతులు ఉన్నారు. కాగా టోకెన్ల కోసం వేచి ఉండలేక రైతులు నేలపైనే కూర్చున్నారు. ఇచ్చే రెండు బస్తాలకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎదురుచూడాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో యూరియా కోసం ఎప్పు డూ ఇలా పడిగాపులు కాయలేదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రెండు బస్తాల యూరియా సరిపోవడం లేదన్నారు. 300 మంది రైతులకు 700 బస్తాల యారి యా పంపిణీ చేసినట్లు సింగిల్ విండో సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉంటే టోకెన్ల పంపిణీలో తోపులా ట జరగకుండా పోలీసులు నియంత్రించారు.