
సీపీఐ చరిత్ర మొత్తం పోరాటాలమయం
ఉండవెల్లి: ఓట్లు, సీట్ల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది సీపీఐ మాత్రమేనని, చరిత్ర మొత్తం పోరాటాలమయమని సీపీఐ జాతీయ నాయకురాలు సురవరం విజయలక్ష్మి అన్నారు. ఆదివారం మండలంలోని కంచుపాడులో సీపీఐ మహాసభను సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. 100 ఏళ్లుగా దేశంలో పేదల కోసం సీపీఐ అవిశ్రాంత పోరాటాలు సాగిస్తుందన్నారు. దున్నే వాడికే భూమి కావాలని మొట్ట మొదట నినదించిన పార్టీ సీపీఐ అని, ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి పేదల కోసం పోరాటాలు చేసిందని కొనియాడారు. ఆగస్టు 4న నిర్వహించే సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం కంచుపాడులో సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు సురవరం కపిల్, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, రవి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.