
ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న అబ్దుల్ రాఫే
మహబూబ్‌నగర్‌కి చెందిన అబ్దుల్ రాఫే బ్యాటింగ్‌తో పాటు కీపర్‌గా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్టిక్ట్ అండర్–19 వన్డే క్రికెట్‌లో బ్యాటింగ్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. గద్వాలపై అబ్దుల్ రాఫే అద్భుతమైన బ్యాటింగ్‌తో అజేయ డబుల్ సెంచరీ చేశాడు. 173 బంతుల్లో 6 సిక్స్‌లు, 31 ఫోర్లతో 243 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నారాయణపేటపై 127 బంతుల్లో 3 సిక్స్‌లు, 25 ఫోర్లతో 165 పరుగులు చేశాడు. లీగ్‌లో 495 పరుగులు చేసి బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2023లో టుడే లీగ్‌లో రెండు సెంచరీలు, మూడు అర్థసెంచరీలు చేశాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో పీయూ తరఫున ఆడి రాణించాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టమని, టీమిండియాకు ఆడాలన్నదే తన కల అని పే అంటున్నాడు అబ్దుల్ రాఫే.

ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న అబ్దుల్ రాఫే