
పెట్టుబడిదారుల అనుకూల చట్టాలు రద్దు చేయాలి
అలంపూర్: కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. అలంపూర్ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయరహదారిపై ఉన్న పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద సీఐటీయూ అధ్వర్యంలో టోల్‌ప్లాజా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తెచ్చిన జీఓ 282ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. కార్మికుల పనిగంటలు పెంచడంతో సంఘాలు పెట్టుకోవడానికి అవకాశం లేకుండమే ప్రభుత్వాల లక్ష్యమన్నారు. కార్మికుల కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. నాయకులు పీఠర్, మద్దయ్య, శేషన్న, రాజశేఖర్, వెంకట్రాముడు, లాజర్ తదితరులు ఉన్నారు.