ఏరువాకా సాగారో..
ఎర్రవల్లి మండలం జింకలపల్లిలో ఊరేగింపుగా వెళ్తున్న ప్రజలు
నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు.. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి.. ప్రధానంగా ప్రతి రైతుకు సంబంధించి అతిపెద్ద పండుగ ఏరువాక పున్నమి. జిల్లావ్యాప్తంగా రైతులు బుధవారం ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఉదయాన్నే సేద్యానికి అవసరమైన పరికరాలకు.. ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. గజ్జెలు, గంటలు, పూల దండలతో ఎడ్లను అలంకరించి ఊరేగింపుగా పొలాలకు వెళ్లారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పంటలు బాగా పండాలని భూతల్లికి పూజలు చేసి పొలం దున్నడం ప్రారంభించారు. సాయంత్రం గ్రామాల్లో ఏరువాక తోరణాలు పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా రైతులు ఆనందోత్సాహాలతో పరుగులు పెట్టించారు. – సాక్షి నెట్‌వర్క్
షేకుపల్లిలో బోనం ఎత్తిన చిన్నారులు
గట్టులో ఎడ్ల బండ్ల ఊరేగింపు
ఏరువాకా సాగారో..
ఏరువాకా సాగారో..


