పెండింగ్ రైల్వే పనులు పూర్తి చేయాలని ఎంపీ వినతి
పాలమూరు: మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులపై మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఢిల్లీలో ఎంపీ డీకే అరుణ వినతి పత్రం అందించారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల హుబ్లీతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత సులభతరం అవుతుందన్నారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణ పనులపై గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


