జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

Jun 2 2025 12:43 AM | Updated on Jun 2 2025 12:43 AM

జిల్ల

జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

గద్వాల క్రైం: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో పని చేస్తున్న పోలీసు సిబ్బందికి ఉత్తమ, సేవా పతకాల జాబితాను ఆదివారం విడుదల చేసింది. జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న నలుగురు పోలీసు సిబ్బంది ఉత్తమ, కఠిన సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకాల విభాగంలో ధరూరు పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వెంకట్రాములు ఎస్‌ఐ (సీఐడి హైద్రాబాద్‌ లకిడీకపూల్‌ ప్రస్తుత స్థానం), జిల్లా సాయుధ బలగాల విభాగంలో ఏఆర్‌ఎస్‌ఐ టి ఆంజనేయులు ఎంపికయ్యారు. సేవా పతకానికి ఇటిక్యాల, అలంపూర్‌ పోలీసు స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుళ్లు ఆర్‌.రాజవర్ధన్‌రెడ్డి, టి.అమరనాథ్‌లు ఎంపికయ్యారు. ఉత్తమ, సేవా పథకాలకు జిల్లా పోలీసుశాఖ నుంచి నలుగురు ఎంపిక కావడంతో ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు 1
1/3

జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు 2
2/3

జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు 3
3/3

జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement