
ప్రాణాలకు ముప్పు తెచ్చే ఫ్యాక్టరీ పెట్టొద్దు
రాజోళి: ప్రాణాలకు ముప్పు తెచ్చే ఫ్యాక్టరీ పెట్టొద్దని పెద్దధన్వాడ ప్రజలు డిమాండ్ చేశారు. మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శనివారం 17వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గ్రామంతో పాటు ఆయా గ్రామాల రైతులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే చిన్నకారు రైతులు వీధిన పడతారని, ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ భూములు దెబ్బతినడమే కాకుండా, పంటలు చేతికి రాకుండా పోతాయని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేయాలని, రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment