ఆదమరిస్తే.. అగ్గిపాలే! | - | Sakshi
Sakshi News home page

ఆదమరిస్తే.. అగ్గిపాలే!

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

ఆదమరిస్తే.. అగ్గిపాలే! – 8లోu ‘అక్రమ పట్టాదార్‌ పాస్‌పుస్తకం రద్దు చేయాలి’ నేడు భారీ ర్యాలీ అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ సమాచారమిస్తే తక్షణమే స్పందిస్తాం.. ట్యాంకర్‌తో తాగునీటి సరఫరా

న్యూస్‌రీల్‌

అగ్నిమాపకశాఖ సూచనలు

77 యూనిట్లు..

80,200 ఎస్‌బీలు లక్ష్యం

బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

కాలసర్ప నివారణ పూజలకు భక్తుల రద్దీ

కాళేశ్వరం: మంగళవారం సెలవు కావడంతో కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వద్ద కాలసర్ప నివారణ పూజలు భక్తులు అధిక సంఖ్యలో నిర్వహించారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. సుమారుగా 200లకుపైగా భక్తులు పూజలు చేశారు. శ్రీశుభానందేవిచ, శ్రీసరస్వతీ అమ్మవార్లను దర్శించుకున్నారు. మంచి ముహూర్తాలు ఉండడంతో భక్తులు తమ పెళ్లిళ్లు, దోషాల పాపహరణం కోసం ముందస్తుగా కాలసర్ప నివారణ పూజలు చేసుకుంటున్నారు. దీంతో కాళేశ్వరాలయం పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది.

లక్ష్యంతో చదివితే

బంగారు భవిష్యత్‌

ఎస్‌ఎస్‌తాడ్వాయి: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే లక్ష్యంతో చదివితే బంగారు భవిష్యత్‌ ఉంటుందని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ దబ్బగట్ల జనార్దన్‌ అన్నారు. మండల పరిధిలోని ఊరట్టం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పాఠశాల పీజీ హెచ్‌ఎం కల్తి శ్రీనివాస్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽఽథులుగా డీడీ జనార్దన్‌, ఏటీడీఓ అజయ్‌కుమార్‌, ఏఎంఓ సుందర్‌రెడ్డి, సర్పంచ్‌ శైలజ హాజరై అంబేడ్కర్‌, సరస్వతిదేవి చిత్రపట్టాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతూ మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థినులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సమ్మక్క పూజారి సిద్ధబోయిన స్వామి, డిప్యూటీ వార్డెన్‌ రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మంగపేట: మండల పరిధిలోని కమలాపురానికి చెందిన మేడిపెల్లి వెంకటేశ్వర్లు తనకు భూమి లేకున్నా 18 ఎకరాలు ఉన్నట్లుగా అక్రమంగా పొందిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను వెంటనే రద్దు చేయాలని సిద్ధాబత్తుల జగదీశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగదీశ్వర్‌రావు మాట్లాడారు. వెంకటేశ్వర్లు రెవెన్యూ అధికారుల సహకారంతో మండలంలోని చెరుపల్లి, కమలాపురంలో 151/1, 208/6, 208/6ఏ సర్వే నంబర్లలో 18 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లుగా పట్టాదార్‌ పాసుపుస్తకాలు పొందాడని తెలిపారు. వాటిపై బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాడని, ప్రభుత్వం నుంచి రైతుబంధు సైతం తీసుకుంటున్నట్లుగా తహసీల్దార్‌కు గతేడాదిలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ విషయంపై గిర్ధావర్‌, సర్వేయర్‌ సర్వే చేయగా భూమిలేదని సరైన ఆధారాలు లేవని 2026 ఫ్రిబ్రవరి 28న తనకు లెటర్‌ ద్వారా తెలిపారని వివరించారు. అదే విషయాన్ని కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దీంతో వెంకటేశ్వర్లు తనపై కోపంతో అతని స్నేహితుడితో కలిసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు తనకు రక్షణ కల్పించడంతో పాటు అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ములుగు: ములుగులో ఈనెల 18న నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని పురస్కరించుకొని నేడు సాయంత్రం 4 గంటలకు సుమారు 500 ద్విచక్ర వాహనాలతో జిల్లా కేంద్రంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్‌ గండ్రకోట కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిర్లక్ష్యం వహిస్తే నష్టం అధికం

జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

నేటినుంచి అవగాహన సదస్సులు

భూపాలపల్లి అర్బన్‌: సూరీడు నేలకొచ్చినట్టు ఎండలు మంట రేపుతున్నాయి.. జనానికి సెగలు పుట్టిస్తున్నాయి.. సామాన్య ప్రజలను అల్లాడిస్తున్నాయి.. ఈ సమయంలోనే చిన్నపాటి అజాగ్రత్తతో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంది. తద్వారా సర్వం బుగ్గి అయ్యే ప్రమాదం ఉంది. ఎండాకాలం, మండించే కాలం కాబట్టి అప్రమత్తత అవసరమని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క అగ్నిమాపక కేంద్రం భూపాలపల్లిలో ఉంది.

గతేడాది రూ.2కోట్ల మేర నష్టం

జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 49 అగ్నిప్రమాదాలు జరగగా వాటిల్లో సుమారు రూ.కోటి 42 లక్షల మేర నష్టం జరిగింది. అగ్నిప్రమాదాల్లో రూ.58 కోట్ల ఆస్తిని సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో ఏ చిన్నపాటి ప్రమాదం వాటిల్లినా తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో అగ్నిప్రమాదాలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖాధికారులు విశేష కృషి చేస్తున్నారు.

14నుంచి 20వరకు వారోత్సవాలు

ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దానిలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో స్టాల్‌ ఏర్పాటు చేసి అగ్నిమాపక అమరవీరులకు మౌనం పాటించారు. రెండో రోజు ప్రజా ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు, మూడో రోజు గృహాల్లో జరిగే ఎల్పీజీ, విద్యుత్‌ అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన, నాలుగో రోజు ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన, ఐదో రోజు పెట్రోల్‌ బంకులు, ఎల్పీజీ గోడౌన్లు, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై, ఆరో రోజు ఫంక్షన్‌ హాళ్లు, పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై, చివరిగా ఏడో రోజు పాఠశాల, కళాశాల విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సమయస్ఫూర్తి అవసరం

ప్రస్తుతం ఎండలు అధికమయ్యాయి. ఈ సమయంలో అగ్నిప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జిల్లాలో అధికశాతం తీరప్రాంత గ్రామాలు, మారుమూల ప్రాంతాలు కావడంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా అంతా బుగ్గి అవుతుంది. గతంలో తీరప్రాంత గ్రామాల్లో అగ్నిప్రమాదాలు జరిగి భారీ నష్టం చూడాల్సి వచ్చింది. ప్రమాదాలు జరిగిన సమయంలో సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తే నష్టాన్ని నివారించవచ్చు.

అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తాం. అగ్నిమాపక శకటం వచ్చేలోగా నీటితో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాలి. తద్వారా నష్టం కాస్త తగ్గుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే 101, భూపాలపల్లి ఫైర్‌ స్టేషన్‌ 87126 99208 నంబర్లకు సమాచారం అందించాలి.

– సతీష్‌కుమార్‌, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి

ఏటూరునాగారం: మండల పరిధిలోని గంటలకుంటలో గొత్తికోయ గిరిజనులకు తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఆ గూడేనికి మంగళవారం వాటర్‌ ట్యాంక్‌ను పంపించి నీటిని అందించారు. దీంతో గొత్తికోయలు ఆనందం వ్యక్తం చేశారు. వేసవి కాలం ముగిసే వరకు నీటి ఎద్దటి లేకుండా చూస్తామని స్థానిక నాయకుడు గుడ్ల దేవేందర్‌ తెలిపారు. గూడెంలో బోరు నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు చెప్పడంతో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందజేయాల్సి వస్తుందని దేవేందర్‌ తెలిపారు.

కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గి పుల్లలను ఆర్పివేసిన తర్వాత పారేయాలి. చెత్త, గడ్డి, ఎండిన చెట్లు, పూరిపాకల వద్ద వీటిని వేయరాదు.

ఎక్కువ రోజులు ఇంట్లో లేని సమయంలో విద్యుత్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయాలి.

వంట గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

గృహాలకు గడ్డి వాములు 60 అడుగుల దూరంలో వేసుకోవాలి.

పూరింట్లో నివసించే వారు వంట పూర్తయిన వెంటనే పొయ్యిలో నిప్పును ఆర్పేయాలి.

వేసవిలో ఉదయం 8 గంటల లోపు, సాయంత్రం 6 గంటల తర్వాత కట్టెల పొయ్యిలను ఉపయోగించాలి.

గ్యాస్‌ సిలిండరుకు దగ్గరలో పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌ వంటి మండే వస్తువులు ఉంచరాదు.

వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్‌ ఆపేయాలి.

అపార్ట్‌మెంట్లు, కర్మాగారాల గోదాములు, గిడ్డంగులలో అగ్నిమాపక శాఖ సూచనలు విధిగా పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు.

వరంగల్‌ సర్కిల్‌ 14 డివిజన్లలో సేకరణ

స్టాండర్డ్‌ బ్యాగుకు రూ.3,300 ధర ఖరారు

రూ.54.90 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement