పార్టీ పటిష్టతకు పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీ పటిష్టతకు పాటుపడాలి

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

పార్టీ పటిష్టతకు పాటుపడాలి

మల్హర్‌(కాటారం): క్రమశిక్షణతో అంకితభావంతో పార్టీ పటిష్టతకు పాటుపడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఽఇటీవల కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కమిటీకి ఎన్నికై న పంతకాని సమ్మయ్య, కుంభం స్వప్నరెడ్డి, అంగజాల అశోక్‌ మంగళవారం కాటారం మండలం ధన్వాడ గ్రామంలో మంత్రి శ్రీధర్‌బాబును కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పదవులకు వన్నెతెచ్చేలా నాయకుల పనితనం ఉండాలన్నారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి మరలా వచ్చేలా ప్రజాప్రతినిధులు, పార్టీ పదవులు ఉన్నవారు ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

శ్రీధర్‌బాబు

Advertisement
 
Advertisement
Advertisement