పోటీ ప్రపంచంలో నిలబడే సామర్థ్యాలు
కాటారం, రేగొండ, చిట్యాల కస్తూర్బా పాఠశాలలు ఎంపిక
భూపాలపల్లి అర్బన్: కస్తూర్బా బాలికల విద్యాలయాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 495 కస్తూర్బా పాఠశాలల్లో 93 పాఠశాలను యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ ఆర్గనైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (వైఐఐఓఈ) కేంద్రాలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ జాబితాలో జిల్లాలో కాటారం, రేగొండ, చిట్యాల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఎంపికయ్యాయి. ఈ పాఠశాలలను ఎంపిక చేయడం ద్వారా బాలికలకు పోటీ పరీక్షల దిశగా ప్రాథమిక స్థాయి నుంచే తగిన శిక్షణ అందించనున్నారు. క్లాట్, యూపీఎస్సీ, నీట్, ఐఐటీ, గ్రూప్స్, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన మార్గదర్శనం, మాక్ టెస్టులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ అవకాశాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంత బాలికలకు చేరుకోవడం విద్యారంగంలో ముందడుగుగా పలువురు భావిస్తున్నారు. ఈ శిక్షణల ద్వారా విద్యార్థినుల్లో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నిపుణుల ఉపన్యాసాలు, కేరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, వర్క్‌షాపుల ద్వారా భవిష్యత్ లక్ష్యాలను నిర్ధారించుకునేలా ప్రోత్సహిస్తారు..
జిల్లాలో 11 కేజీబీవీలు
జిల్లాలోని 12 మండలాల పరిధిలో 11 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే ఇంటర్మీడియట్ వరకు బోధిస్తున్నారు. 2,563మంది విద్యనభ్యసిస్తున్నారు. వైఐఐఓయూకు ఎంపికై న కేజీబీవీల్లో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి నూతన శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. ఇందులో అర్హత పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన శిక్షణ తరగతులు
అర్హత పరీక్ష ద్వారానే
సీట్ల కేటాయింపు
రేపటి వరకు దరఖాస్తుల గడువు
జిల్లాలో కాటారం, రేగొండ, చిట్యాల మూడు కస్తూర్బా స్కూళ్లను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీగా మార్చడానికి ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంత బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ ప్రపంచంలో నిలబడే సామర్‌ాధ్యన్ని పెంపొందించే దిశగా కీలక అడుగుగా నిలుస్తుంది. ప్రవేశ పరీక్షలలో ప్రతిభచూపిన వారికి అవకాశాలు లభిస్తాయి.
– రాజేందర్,
జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి


