కొలువుదీరిన పాలకవర్గం | - | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన పాలకవర్గం

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం దేవాదాయశాఖ సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈఓ శనిగెల మహేశ్‌ ఆధ్వర్యంలో 11 మంది ధర్మకర్తలు, ఒక ఎక్స్‌అఫీషియో (అర్చక)తో ఆలయ చైర్మన్‌గా అవధాని మోహన్‌శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈఓ చైర్మన్‌తో పాటు ధర్మకర్తలను ప్రమాణస్వీకారం చేయించారు. ధర్మకర్తలుగా దొడ్ల అశోక్‌, కుంభం పద్మ, అడ్డూరి శ్రీధర్‌ రావు, మంచినీళ్ల దుర్గయ్య, గందెసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, జలవంచ సీతారాం, కాటం సత్తయ్య, శ్యాంసుందర్‌ దేవుడా, ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా దేవస్థానం ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ 12మంది సభ్యులు రెండేళ్ల కాల పరిమితితో కొలువుదీరారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తమ హాయంలో బృహత్తర ప్రణాళికతో మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో దేవస్థానం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతామన్నారు.

కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌గా

అవధాని మోహన్‌శర్మ

Advertisement
 
Advertisement
Advertisement