ఖాళీ బిందెలతో ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఖాళీ బిందెలతో ధర్నా

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

ఖాళీ బిందెలతో ధర్నా

భూపాలపల్లి అర్బన్‌: పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీ వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సర్వే నంబర్‌ 280లో ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గుడిసెవాసులకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎండాకాలంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, గత సంవత్సరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బోర్‌ వేయించినప్పటికీ ప్రస్తుతం సుమారు 400 కుటుంబాలు నివసించడం వల్ల సమస్య మరింత పెరిగిందని తెలిపారు. భగత్‌సింగ్‌ కాలనీ సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమరయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కాలనీవాసులు క్యాతరాజ్‌ సతీష్‌, నేరెళ్ల జోసెఫ్‌, గోలి లావణ్య, ఎండీ.యాకూబ్‌ పాషా, గంప రాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement