హాజరైన భక్తులు
స్వామి వారి కల్యాణం జరిపిస్తున్న అర్చకులు
రేగొండ: మండలంలోని గడిపల్లి గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. అర్చకులు సముద్రాల సురేష్, తాండూరి నరేష్ ఆధ్వర్యంలో ఆలయంలోని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రోత్సవాల మధ్య రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్‌రెడ్డి వేర్వేరుగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, సర్పంచ్ వానరాశి మౌనిక, ఆలయ చైర్మన్ జిట్టా రామకృష్ణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నామాల రమేష్, ఎన్‌ఎస్‌ఆర్ సంస్థల చైర్మన్ సంపత్‌రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


