సింగరేణిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

భూపాలపల్లి అర్బన్‌: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా విద్యాభివృద్ధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సామాజిక సంస్కర్త అని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన సింగరేణి పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, అధికారులు ఎర్రన్న, రవికుమార్‌, మారుతి, మురళీమోహన్‌, నవీన్‌కుమార్‌, పాషా, మధుకర్‌రెడ్డి, నజీర్‌, బీసీ సంఘం నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement