టేకుమట్ల: నేరాల నియంత్రణకు కృషి చేయాలని, శాంతి భద్రతలు కాపాడాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలు తెలుసుకుని పెండింగ్ కేసులపై దృష్టి సారించాలన్నారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవాంఛనీయ ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా కచ్చితమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. ప్రజా ఫిర్యాదులో జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేష్, టేకుమట్ల ఎస్సై అమూల్య పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


