కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి పరిశీలించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు తాగునీటి సదుపాయం, నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రహమాన్, పరీక్షల నియంత్రణాధికారి సుధీర్, అధ్యాపకులు శ్రీదేవి, ఆశీర్వాదం, జితేందర్, ఆదిరెడ్డి, ఏటీబీటీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


