పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

Mar 29 2026 7:22 AM | Updated on Mar 29 2026 7:22 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని టెన్త్‌ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ రాహుల్‌శర్మ శనివారం పరిశీలించారు. విద్యార్థులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, సమయపాలన కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. డీఈఓ రాజేందర్‌ చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాల, టేకుమట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మొట్లపల్లి పాఠశాలలను సందర్శించి పరీక్షా నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరిశీలకులు జనార్దన్‌రావు, డిప్యూటీ డైరెక్టర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ గణపురం మండలంలోని ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,544 మంది విద్యార్థులకు గాను ఐదుగురు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement